చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో గంజాయిని విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఓల్డ్ బైపాస్ రోడ్డు, ఇంజనీర్స్ కాలనీ వద్ద గంజాయి విక్రయిస్తున్న షేక్ షంషీద్, తనుష్, వాసు, షేక్ మహబూబ్ బాషాలను మదనపల్లె రెండవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3.142 కిలోల గంజాయితో పాటు.. ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: