ETV Bharat / state

వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంతో వైభవంగా సాగుతోంది. తొమ్మిదిరోజు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

author img

By

Published : May 14, 2019, 5:12 PM IST

గంగమ్మ జాతర
తొమ్మిదోరోజు వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

తిరుమల శ్రీవారికి ఆడపడుచుగా భక్తులు భావించే.. తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా సాగుతున్నాయి. తొమ్మిదోరోజు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అమ్మవారి జాతరతో నగరంలో పండగ వాతావరణం ఏర్పడింది. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, అంబలి పంపిణీ చేశాయి.

తొమ్మిదోరోజు వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

తిరుమల శ్రీవారికి ఆడపడుచుగా భక్తులు భావించే.. తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా సాగుతున్నాయి. తొమ్మిదోరోజు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అమ్మవారి జాతరతో నగరంలో పండగ వాతావరణం ఏర్పడింది. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, అంబలి పంపిణీ చేశాయి.

ఇది కూడా చదవండి.

తిరుమల ఘాట్​రోడ్డులో గోడను ఢీకొన్న బస్సు..

Intro:ap_cdp_17_14_nityvasara_vasthuvulu_pkg_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ప్రతి నెల ప్రభుత్వ చౌక దుకాణం వస్తువులు ఇవ్వడం ఆలస్యం అవుతుంది.. ఏమో.. గాని వీరిచ్చే ఉచిత వస్తువులు మాత్రం ఆలస్యం కావు. ప్రతి నెల మొదటి ఆదివారం ఎప్పుడు వస్తుందా.. అని ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగువందల పేద ముస్లిం హిందూ కుటుంబాలు ఎదురు చూస్తుంటారు. చౌక దుకాణం వస్తువులు తీసుకునేందుకు డబ్బులు చెల్లించాలి. కానీ వీరు మాత్రం నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని కష్టాలు పడతారు ఆ దేవుడికే తెలియాలి. కానీ నెలలో మొదటి ఆదివారం వచ్చేసరికి పేదలకు ఇవ్వాల్సిన నిత్యవసర వస్తువులను సిద్ధం చేసి ఉంచుతారు. అయితే ఎవరా సంస్థ అనుకుంటున్నారా అయితే మీరే చూడండి..
వాయిస్ ఓవర్:1
కడప కు చెందిన మహబూబ్ బాషా, జిలాని భాష అనే సోదరులు ఇద్దరూ చిన్నపాటి టైర్ల వ్యాపారం చేస్తుంటారు. వీరు టైర్ల కోసం ఊరూరా తిరుగుతున్నప్పుడు వీరు పలువురు పేదలు పడే కష్టాలను కళ్లారా చూశారు. మూడు పూటల తినేందుకు తిండి కూడా లేని వారు వీరి కంట పడ్డారు. అంతే వీరి మనసులో ఆలోచన మొదలైంది. ఇలాంటి పేదలకు కనీసం నాలుగైదు రోజులైనా కడుపునిండా అన్నం పెడితే ఎలా ఉంటుందని భావించారు. మొదట కొద్ది సరుకులను ఓ పేద మహిళలకు ఇచ్చారు. కానీ ఆమె తిరస్కరించింది. అంతటితో వెనుకంజ వేయలేదు. మరో మహిళకు ఇవ్వడంతో ఆమె మహా ప్రసాదం అనుకొని తీసుకుంది. అప్పటి నుంచి వీరు తమ జైత్రయాత్రను సాగించారు. 2013లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. మొదట నాలుగు కుటుంబాలకు ప్రతి నెల నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఆ నాలుగు కుటుంబాలే నేడు నాలుగు వందల కుటుంబాలు అయ్యాయి. మీరు దాతలు ఇచ్చే డబ్బులు ప్రతి శుక్రవారం మసీదుల వద్ద జోలెపట్టి డబ్బులు వసూలు చేస్తారు. ఇలా నెలకు మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఎవరైనా గొప్ప దాతలు ఉంటే వారి నుంచి చందాల రూపంలో డబ్బులు తీసుకొని పేదలకు ప్రతి నెల ఏడు కేజీల జిలకర మసూర, కంది బేడలు చింతపండు, లీటర్ నూనె, ఇలా ఆరు రకాల వస్తువులను ప్రతి నెల క్రమం తప్పకుండా ఇస్తుంటారు. వీరు 1000 నుంచి 1500 రూపాయలు బాడుగ చెల్లించే నిరుపేద కుటుంబాలను ఎంపిక చేస్తారు. వారికి ఫ్రిడ్జ్, కూలర్లు లాంటి సౌకర్యవంతమైన వస్తువులు ఉండరాదు. ఇలా 2013 నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా నిత్యావసర సామాగ్రిని పంపిణీ చేస్తారు. వీరిచ్చే సరుకులు 15 రోజుల పాటు వస్తాయి. ఎంతో మంది పేదలకు వీరు ఇచ్చే వస్తువులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కేవలం కడప నగరంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా సుమారు నాలుగు వందల మందిని ఎంపిక చేశారు. ముస్లింలతో పాటు హిందూ కుటుంబాలు కూడా ఉండటం విశేషం. మీరు చేస్తున్న సేవలను చూసి చాలామంది మంత్రముగ్దులయ్యారు. ఇలాంటి సంస్థలు పదికాలాలపాటు ఉండాలని అని మహిళలు కోరుతున్నారు. వీరు ఇచ్చే వస్తువులు తమకు ఆకలి పెంచుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
byte: బేగం కడప.
byte: ముంతాజ్, కడప.
byte: రెహమాన్, కడప.
byte: సుబ్బమ్మ, కొండాపురం.
వాయిస్ ఓవర్:2
మహమ్మద్ ప్రవక్త మాటల్లో చెప్పాలంటే మనం కడుపునిండా తింటే సరిపోదు. మన పక్కింటి వారు తిన్నారా.. లేదా.. అని ఆలోచించాలి. ఆయన మాటలను ఆదర్శంగా తీసుకొని ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నాం. పేదరికం ఎంత చెడ్డదో ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. ఊపిరి ఉన్నంతవరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం దాతలు సహకరిస్తే మరికొంతమందికి ఉచిత నిత్యవసర వస్తువులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
byte: మహబూబ్ బాషా, స్వచ్ఛంద సంస్థ, కడప.
వాయిస్ ఓవర్:
ఇలాంటి సంస్థ నిర్వాహకులను ఆదరిస్తే మరెంతో మంది పేదల ఆకలి తీర్చు తారు. రంజాన్ కు ఒక రోజు ముందు ఒక పేద ముస్లిం కుటుంబానికి 300 గ్రాముల మటన్, చెక్కెర, సేమియా ఉచితంగా సరఫరా చేస్తారు.


Body:పేద ముస్లింలకు ఉచిత సహాయం


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.