చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లెలోని ఓ వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలుండటం కలకలం రేపింది. వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు తేలుతూ ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పుంగనూరు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాల్లో ఒకటి మహిళది కాగా మిగతా మూడు మృతదేహాలు చిన్నారులవిగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు ఆడపిల్లలున్నారు. నలుగురి మృతదేహాల్ని బావి నుంచి బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరిది ఆత్మహత్య లేదా మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : అమానుషం: తల్లిని హతమార్చిన కుమారుడు.. సహకరించిన భార్య