తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈనెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న టెక్నోక్రాట్ ఫెస్టివల్ 'విరించి' ప్రచారంలో భాగంగా ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. ఇంజినీరింగ్ విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లోని సాంకేతిక నైపుణ్యం వెలికితీసేలా విరించి ఉత్సవాలను నిర్వహిస్తామని వర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఫ్లాష్ మాబ్ ద్వారా అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌కు 'కరోనా' రాకతో ఏపీ అప్రమత్తం