చిత్తూరు జిల్లా పుంగనూరు - చౌడేపల్లి మార్గమధ్యంలో చింతమాకులపల్లి వద్ద మొక్కజొన్న లోడు లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారు బయటకు వచ్చిన కాసేపటికి లారీలో మంటలు చేలరేగాయి. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం