ETV Bharat / state

భక్తులతో తిరుమలలో పండుగ వాతావరణం - Tirumala opens doors to devotees today

శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులతో తిరుమలలో పండుగ వాతావరణం నెలకొంది. 3 రోజుల ప్రయోగాత్మక దర్శనాలు పూర్తైన తర్వాత సాధారణ భక్తులను తితిదే దర్శనానికి అనుమతించింది. తొలిరోజు 6వేల 998 మంది భక్తులు వైకుంఠనాథుని దర్శించుకొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేవదేవుడిని కనులారా దర్శించుకున్నామంటూ భక్తులు సంతోషం వ్యక్తంచేశారు

భక్తులతో తిరుమలలో పండుగ వాతావరణం
భక్తులతో తిరుమలలో పండుగ వాతావరణం
author img

By

Published : Jun 12, 2020, 3:29 AM IST

Updated : Jun 12, 2020, 5:04 AM IST

భక్తులతో తిరుమలలో పండుగ వాతావరణం

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల తర్వాత తొలిసారిగా తిరుమలకు సాధారణ భక్తులు తరలివచ్చారు. స్థానికులు, తితిదే ఉద్యోగులతో 3 రోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించిన దర్శనాల్లో లోటుపాట్లను గుర్తించిన అధికారులు వాటిని సరిదిద్ది గురువారం నుంచి సాధారణ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

వేకువజామున శ్రీవారికి సుప్రభాతం ఇతర సేవలను ఏకాంతంగా నిర్వహించి కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా ఆరున్నర గంటల నుంచి భక్తులను దర్శరనానికి అనుమతించారు. తొలుత అరగంట పాటు 53 మంది ప్రముఖులు, అత్యంత ప్రముఖులకు విరామ సమయ దర్శనం కల్పించిన అనంతరం సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతించారు. 7 గంటల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఉచిత టైంస్లాట్‌ టోకెన్లు ఉన్న యాత్రికులను దర్శనానికి అనుమతించారు. గంటకు ఐదు వందల మంది చొప్పున రోజుకు దాదాపు ఏడు వేల మందికి దర్శనం కల్పిస్తున్న తితిదే ఆన్‌లైన్‌ ద్వారా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీచేసింది. వీటితో పాటు తిరుపతిలో అందజేసిన 3వేల750 సర్వ దర్శన టికెట్లు పొందిన వారూ స్వామిని దర్శించుకొన్నారు. తితిదే ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేసిన భక్తులు సుదీర్ఘ విరామం అనంతరం స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొన్నామంటూ పరవశించిపోయారు

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పిన తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి యాత్రికులు కూడా దేవస్థానానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి శ్రీవారి దర్శనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న తితిదే భక్తుల సంఖ్య పెంచే అంశంపై తొందరపడటం లేదంది. మరికొన్ని రోజుల పాటు దర్శనాలను పరిశీలించిన అనంతరం సమీక్ష నిర్వహించి, సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ఇవీ చదవండి

తిరుమల భద్రతా విభాగంలో పొరుగుసేవల సిబ్బందికి అందని వేతనాలు

Last Updated : Jun 12, 2020, 5:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.