ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహామ్మారిపై యుద్దం చేయలాంటే ప్రతి ఒక్కరు ఇంటిపట్టున ఉండాల్సిందే. ప్రభుత్వాలు సైతం వైరస్‌పై తగిన జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా పట్టణ వాసులకు అదేదీ చెవిన పడలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
కరోనా వైరస్‌పై పూర్తి అవగాహనతో స్వీయ నియంత్రణ పాటించారు. వ్యవసాయ పనులకు సైతం వేరే గ్రామ ప్రజలను తమ గ్రామంలోకి రానివ్వకుండా ఆంక్షలు విధించారు. ఊరందరూ ఏకమై ఒక్కో రోజు ఒకరి పొలంలో పనులు చేస్తూ కూలీల కొరత లేకుండా చూసుకొన్నారు. భౌతిక దూరంతో నిబంధనలు అనుసరిస్తూ కరోనాపై యుద్దం చేస్తున్నారు. ఈ విషయంపై.. తిరుపతి నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు.
ఇవీ చదవండి: