ఓ వ్యక్తి కరోనాతో మరణించడంతో వారి పొలం పనులకు కూలీలు ఎవరూ వెళ్లొద్దంటూ గ్రామ వాలంటీర్ బెదిరించిన ఘటన.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ధనమూర్తిపల్లిలో జరిగింది. తన మాట కాదని ఎవరైనా కూలికి వెళ్తే.. గ్రామంలోకి రానీయనంటూ వాలంటీర్ నాగరాజు హెచ్చరించాడని రైతు చెప్పాడు. ధనమూర్తిపల్లికి చెందిన దామోదర్‌నాయుడు కుమార్తె భర్త చిట్టిబాబు.. కరోనాతో ఈనెల 21న మృతిచెందాడు. ఆ తర్వాత కుటుంబసభ్యులు పరీక్షలు చేయించుకోగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఆ క్రమంలోనే వేరుశనగ నూర్పిడి కోసం కూలీలను పిలవగా వాలంటీర్ నాగరాజు ఎవరినీ రానీయలేదని రైతు దామోదర్‌నాయుడు ఆరోపిస్తున్నాడు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాడు.
ఇదీ చదవండి: శ్రీకాకుళం జిల్లాలో కరోనా కల్లోలం: వరుస చితిలు