ETV Bharat / state

రుయా బాధిత కుటుంబానికి పరిహారం అందజేత

author img

By

Published : May 13, 2021, 11:37 PM IST

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్​ అందక మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. చిత్తూరుకు చెందిన భువనేశ్వర్​ బాబు కుటుంబానికి ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి రూ.10 లక్షల చెక్కును అందించారు.

ex gratia
పరిహారం చెక్కును అందిస్తున్న ఉపముఖ్యమంత్రి

ఈ నెల 10వ తేదీన తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సమస్యల కారణంగా పదకొండు మంది మృతి చెందారు. వీరిలో చిత్తూరు నగరానికి చెందిన భువనేశ్వర్ బాబు ఒకరు. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్​గ్రేషియా ప్రకటించింది. స్థానిక కలెక్టరేట్​లో భువనేశ్వర్ బాబు తండ్రికి ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి పది లక్షల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రుయాలో దారుణం... మార్చురీలో మృతదేహం ఉంచేందుకు సిబ్బంది నిరాకరణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.