కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఫలితాలు... వ్యవస్థ మూలాల వరకూ అందాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం ఆర్థిక శాఖ విభాగాపధిపతి దేవసేన నాయుడు అభిప్రాయ పడ్డారు. దేశీయ జీడీపీలో పది శాతం నిధులను కేటాయించటం ఆహ్వానించదగిన అంశమని ఆయన అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా.... ప్రోత్సాహకాల కేటాయింపుల్లో విదేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం, స్వయం సహాయక సంఘాలు, అసంఘటిత కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించి ఆదుకోవాలన్నారు. ఆర్థిక ప్యాకేజీ ఫలితాలపట్ల పలు ఆసక్తికర అంశాలను ఈటీవీ భారత్ ముఖాముఖిలో దేవసేననాయుడు పంచుకున్నారు.
ఇదీ చూడండి: