Srikalahasteeswaram: తిరుమల తరహాలో శ్రీకాళహస్తీశ్వరాలయానికీ ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. మహాశివరాత్రి రోజున ముక్కంటి ఆలయ ఛైర్మన్గా అంజూరు తారక శ్రీనివాసులతో పాటు 14 మంది ధర్మకర్త మండల సభ్యులు, గురుకుల కుటుంబం నుంచి ఎక్స్ అఫీషియో సభ్యుడు ప్రమాణ స్వీకారం చేశారు.
నాలుగు నెలల తర్వాత తాజాగా.. ధర్మకర్త మండలికి అనుబంధంగా మరో ఎనిమిది మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ దేవాలయ శాఖ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ సింగాల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నియోజకవర్గానికి చెందిన జూలకంటి సుబ్బారావు, చింతామణి పాండు, మదన్ మోహన్ రెడ్డి, శోభ, నీలా, శ్రీదేవి, మీనాక్షి, పవన్ కుమార్ ఉన్నారు. వీరంతా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో ఆదివారం గంగాసదనంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: