చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. గ్రామ సమీపంలోని పొలంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ను తాకడంతోనే ఏనుగు మరణించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఆ ఏనుగు 20 రోజులుగా మండలంలోని కైలాసకోన, తుంబూరు, అరణ్యకండ్రిగ, పాలమంగళంలోని పలు తోటలు, ఫెన్సింగ్లను ధ్వంసం చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అప్పటినుంచి ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం కనిపించలేదు.
అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఇదీ చదవండి: పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగులు... చర్యలు తీసుకోవాలంటున్న రైతులు