చిత్తూరు జిల్లా పలమనేరు గొబ్బిళ్ళ కోటూరు వద్ద సుబ్రహ్మణ్యం అనే రైతుకు చెందిన పంట పొలాల్లో ప్రవేశించిన ఏనుగులు తెల్లవారుజామున తిరిగి వెళ్తున్నాయి. దారిలో విద్యుత్ తీగలు కిందికి ఉండటం, అదే చోట గున్న ఏనుగు తొండం పైకెత్తడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. పిల్ల ఏనుగు చనిపోవడంతో తల్లి ఏనుగు సుమారు అరగంటపాటు దాని చుట్టూ తిరిగి లేపటానికి ప్రయత్నించిన దృశ్యాలు చూసిన అక్కడ ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించిపోయాయి. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడకు చేరుకొని పోస్టుమార్టం చేసి ఖననానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక రైతులు విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని విద్యుత్‌శాఖ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : దాణా లేక పశువులు విలవిల.. సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు