చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కీళంబాకంలో ప్రజలు పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. తెదేపా నాయకులు పోటీలో లేకపోవటంతో.. ఈ నిర్ణయం తీసుకున్న గ్రామస్థులు.. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఒక్కరూ వెళ్ళలేదు. పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు ఒక్కరూ కనబడలేదు. మరోవైపు కందులవారిపల్లిలో ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ గంటగంటకు ఓటింగ్ శాతం మాత్రం పెరిగింది.
కందులవారిపల్లి పంచాయతీలోని నారావారిపల్లి, నారావారిపల్లి కాలనీ, కందులవారిపల్లిలో 578 ఓట్లకు గాను ఇప్పటివరకు 273 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. కానీ ఓటర్లు మాత్రం తాము ఓటు హక్కును వినియోగించుకోలేదని.. అయినా ఓట్లు పోలైనట్లు అధికారులు తెలుపుతున్నారని వాపోయారు.
ఇదీ చదవండి: తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది: చంద్రబాబు