రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదుట భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) నాయకులు ధర్నా నిర్వహించారు. లాభాల్లో ఉన్న రైల్వేను కార్పొరేట్ అధిపతులకు కేటాయించడంలో ఆంతర్యమేమిటని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర ప్రశ్నించారు. రైల్వేల ప్రైవేటీకరణ జరిగితే భవిష్యత్తులో యువతకు ఉద్యోగాలు రావటం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి రైల్వే ప్రైవేటీకరణ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: ఆర్టీసీ డ్రైవర్‌పై దుండగుల దాడి.. పరిస్థితి విషమం