ETV Bharat / state

శ్రీకాళహస్తిలో ఆగని కరోనా వ్యాప్తి - శ్రీకాళహస్తి నేటి వార్తలు

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. స్థానికులు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Discontinuous corona outbreak in Srikalahasti
శ్రీకాళహస్తిలో ఆగని కరోనా వ్యాప్తి
author img

By

Published : May 26, 2020, 9:28 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైరస్ కేసుల పెరుగుదలతో స్థానికులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పట్టణానికి చెందిన ఓ విద్యార్థికి ఈనెల 11న పాజిటివ్ అని ఫలితం వచ్చింది. అతని కుటుంబ సభ్యులు, స్నేహితులకూ ఈ వైరస్ సోకింది.

తాజాగా.. బహదూర్​పేటకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా నిర్ధరణ కాగా.. వారిని చికిత్స నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి పంపించారు. కరోనా మరింత విస్తృతం కాకుండా ఉండేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

పొలాల్లోనే టమాటా పాతర.. అప్పుల భారంతో ఆత్మహత్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.