'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా వెదురుకప్పు మండలం మాంబేడు పంచాయతీలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి చేదు అనుభవం ఎదురైంది. పర్యటనలో భాగంగా దిగువ గెరిగదొన ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకుంటున్న క్రమంలో అదే కాలనీకి చెందిన ఓ యువకుడు తమ కాలనీకి సరైన రోడ్డు వసతి లేదంటూ ఉపముఖ్యమంత్రిని నిలదీశారు. గ్రామంలో ప్రధాన వీధికి సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవటం న్యాయమా ? అంటూ నిలదీశారు.
దీంతో ఆగ్రహానికి గురైన నారాయణ స్వామి "నువ్వు తెదేపా వ్యక్తివి. ఎవరో పంపితే ఇక్కడకు వచ్చి ఆరోపణలు చేస్తున్నావు" అంటూ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో దారి సమస్య లేదా ? అని సదరు యువకుడిని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు యువకుడిని వారించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వివాదం నెలకొనటంతో సదరు దృశ్యాలు చిత్రీకరిస్తున్న ఓటీవీ ఛానల్ రిపోర్టర్‌ను నేతలు దుర్భాషలాడారు.
ఇవీ చూడండి