ఇదీ చదవండి: Tributes to Jagjivan Ram: బాబు జగ్జీవన్ రామ్ జయంతి.. ప్రముఖుల నివాళులు
Dalit Protest: స్మశానానికి దారి ఇస్తారా?లేదా?.. మృతదేహంతో నిరసన
Dalit Protest: స్మశానానికి వెళ్లడానికి రోడ్డు వసతి లేదు.. అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు తప్పా దానిని పరిష్కరించడంలేదు. ఇక విసుగు చెందిన దళితులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మృతదేహాన్ని తీసుకొచ్చి ధర్నా చేపట్టారు. రోడ్డు సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. డప్పులు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండల సచివాలయం ప్రాంగణంలో జరిగింది. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
సమస్య పరిష్కారానికి మృతదేహంతో నిరసన