Sricity: డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ నిర్మాణానికి.. గురువారం చిత్తూరు జిల్లా శ్రీసిటీలో శంకుస్థాపన చేశారు. ఆ సంస్థకు ఇది దేశంలో 3వ ఉత్పత్తి కేంద్రం కాగా.. దక్షిణ భారతదేశంలో మొదటిది. శ్రీసిటీలోని కేంద్రాన్ని భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ, చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్స్ మసయుకి టాగా, ప్యుజిత, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ నయోకి నిషియొక, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సమక్షంలో డైకిన్ ఇండియా ఎండీ, సీఈవో కన్వాల్‌జీత్ జావా శంకుస్థాపన నిర్వహించారు. 75.5 ఎకరాల స్థలంలో రూ.1,000 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంటులో 3వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
ఇదీ చదవండి:
కొవిడ్ తగ్గినా.. వృద్ధుల ప్రయాణ ఛార్జిల్లో రాయితీని ఎందుకు పునరుద్ధరించలేదు..?: హైకోర్టు