చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం త్యాగరాజు వీధిలో తెల్లవారుఝామున జనావాసాల మధ్య సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఓ ఆవు చనిపోయింది. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దేవాలయంలో నైవేద్యం తయారుచేయటానికి గ్యాస్ స్టవ్ వెలిగించిన సందర్భంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ పేలింది. ప్రమాదం జరిగిన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పరిసార ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు కేకలు విని బయటకు వచ్చారు. బాధితులను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి ప్రాథమికి చికిత్స చేయించారు. చనిపోయిన ఆవును పోలీసులు, అగ్ని ప్రమాదం శాఖ సిబ్బంది బయటకు తీశారు.
ఇదీ చదవండి: