భారత కమ్యూనిస్టు పార్టీ తమిళనాడు సీనియర్ నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యులు, రచయిత, అనువాదకుడు కామ్రేడ్ పాండియన్(88)... చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పాండియన్కి చిత్తూరు జిల్లాలోని నగరిలో సీపీఎం తరఫున అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. పాండియన్ లేని లోటును తమిళనాడు రాష్ట్రంలో ఎవ్వరూ కూడా భర్తీ చేయలేరని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు షణ్ముగం, రామచంద్రన్, సతీష్ కుమార్, అయ్యప్పన్ తదితరులు పాల్గొన్నారు.
కుల వివక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో పాండియన్ ఎన్నో ఉద్యమాలు చేశారు. చాలా ప్రాంతాలలో కుల వివక్షను అరికట్టడంలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. రాజీవ్ గాంధీ 1991లో తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ ప్రసంగాన్ని తమిళ భాషలో అనువదించడానికి పాండియన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనేక ఫ్రెంచ్ గ్రంథాలను తమిళ భాషలోకి అనువదించారు. రెండుసార్లు లోక్సభకు... సీపీఐ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
ఇదీ చదవండి