ETV Bharat / state

మోదీకి మిగిలేది మూడు నామాలే: నారాయణ

భాజాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ద్వారా అప్రకటిత కేంద్ర పాలన సాగుతోందని... సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. మోదీ అనుకూల రాష్ట్రాల్లో పాలన సాఫీగా నడుస్తోందన్నారు.

సీపీఐ నేత నారాయణ
author img

By

Published : May 18, 2019, 5:20 PM IST

సీపీఐ నేత నారాయణ

దేశంలో భాజాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ద్వారా... అప్రకటిత కేంద్ర పాలన సాగుతుందని... సీపీఐ నేత నారాయణ ధ్వజమెత్తారు. మోదీ ఇంటి కాపలాదారుడిగా వ్యవహరించే స్ధాయికి ఎన్నికల కమిషన్ దిగజారిందని దుయ్యబట్టారు. ఈ నెల 23 తరువాత మోదీకి మూడు నామాలేనని ఎద్దేవా చేశారు. భాజాపా వ్యతిరేకశక్తులన్ని ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దామాషా పద్ధతి ఎన్నికల విధానంలో మార్పులు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

సీపీఐ నేత నారాయణ

దేశంలో భాజాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ద్వారా... అప్రకటిత కేంద్ర పాలన సాగుతుందని... సీపీఐ నేత నారాయణ ధ్వజమెత్తారు. మోదీ ఇంటి కాపలాదారుడిగా వ్యవహరించే స్ధాయికి ఎన్నికల కమిషన్ దిగజారిందని దుయ్యబట్టారు. ఈ నెల 23 తరువాత మోదీకి మూడు నామాలేనని ఎద్దేవా చేశారు. భాజాపా వ్యతిరేకశక్తులన్ని ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దామాషా పద్ధతి ఎన్నికల విధానంలో మార్పులు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి...

చంద్రబాబు చెప్పాకే వీవీ ప్యాట్​లు తెచ్చాం: ఖురేషి

Intro:attn_yuva_ap_cdp_17_18_jerafi_chess_akka_thammudu_pkg_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఇప్పటివరకు మనకు చదరంగం ఆడటం మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు సరికొత్తగా జిరాఫీ చెస్ ఆటను అక్క తమ్ముడు కనుగొన్నారు. ఇప్పటివరకు ఈ ఆట ఐదు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. చెస్ ఆట ఎప్పటికీ డ్రా గానే ముగుస్తుంది. కానీ జిరాఫీ చెస్ ఆట లో డ్రా ఉండదు. ఎవరో ఒకరు గెలుస్తారు. ఇది ఈ ఆట ప్రత్యేకత. చెస్ బోర్డ్ లో 64 గళ్ళు ఉంటాయి, జిరాఫీ చెస్ బోర్డ్ లో 68 గళ్ళుంటాయి. ఆటలో సిపాయిలు, గుర్రం, ఒంటె, ఏనుగు, రాజు, రాణి ఉంటే జిరాఫీ చెస్ ఆటలో వీటికి అదనంగా జిరాఫీ ఉంటుంది. ఈ ఆటను కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అక్క తమ్ముడు రూపొందించారు. ఈ ఆట గురించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
వాయిస్ ఓవర్:1
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగాధర్ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయుడు గా అ పనిచేస్తున్నాడు. ఇతనికి భాగ్యశ్రీ, సాయి కిరణ్ రెడ్డి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి చిన్నతనం నుంచి చెస్ ఆట పట్ల ఎంతో మక్కువ. చిన్నతనంలోనే వీరు చాలామందికి చెస్ నేర్పించారు. కానీ ఈ అక్క తమ్ముడి మనసులో ఓ ఆలోచన తట్టింది. చెస్ ఆట ఎప్పుడు డ్రా గానే ముగుస్తుంది విజయం అనేది ఉండదు. కానీ ఎప్పుడు డ్రా గా ముగిస్తే అందులో గొప్ప తనం ఏముంటుందని భావించారు. అన్ని ఆటల వలె చెస్ లో కూడా విజయం ఉండాలనే ఉద్దేశంతో అక్క తమ్ముడు ఇద్దరూ కలిసి జిరాఫీ చెస్ ను రూపొందించారు. జిరాఫీ చెస్ లో డ్రా లు ఉండవు. గెలుపు ఓటములు మాత్రమే ఉంటాయి. జిరాఫీ చెస్ బోర్డు లో 68 గళ్ళు ఉంటాయి. అదనంగా జిరాఫీ కాయిన్లను చేర్చుతారు. జిరాఫీ కాయిన్ ఎటైనా ఎగరగలవు, మిగిలిన కాయిన్ లన్నీ సాధారణ చెస్ వలే కదులుతాయి. ఈ ఆటలో డ్రా ఉండదు. కావున ఆ ఆడేవారిలో రాజీ పడే తత్వం ఉండదు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతారు. ఒకవేళ ఓడిన తిరిగి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప రాజీ పడటం అనేది ఉండదు. జిరాఫీ చెస్ ఆట క్రీడాకారుని లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. రానున్న రోజుల్లో జిరాఫీ అతను ప్రతి ఒక్కరు ఆదరిస్తారని క్రీడాకారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
byte: మహేష్, జిరాఫీ చెస్ క్రీడాకారుడు, ప్రొద్దుటూరు.
byte: మహమ్మద్ జానీ, జిరాఫీ చెస్ క్రీడాకారుడు, రాయచోటి.
byte: అభిలాష్, జిరాఫీ చెస్ క్రీడాకారుడు, కడప.
వాయిస్ ఓవర్:2
జిరాఫీ చెస్ ఆటలో గెలుపు ఓటములు మాత్రమే ఉంటాయి. డ్రా అనే పదం ఉండదు. ఈ ఆటను కడప జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో విద్యాశాఖ అధికారి అనుమతి తీసుకొని విద్యార్థులకు నేర్పిస్తానని కోచ్ పేర్కొన్నారు.
byte: దస్తగిరి రాజు, జిరాఫీ చెస్ కోచ్, కడప.
వాయిస్ ఓవర్:3
2014లో జిరాఫీ చెస్ ఆటను రూపొందించాం ఇప్పటివరకు తమిళనాడులోని చెన్నై నగరంలో, విజయనగరం లోని బొబ్బిలిలో, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు వందల సంఖ్యలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ ఆట ఐదు రాష్ట్రాల్లో అమల్లో ఉందని చెప్పారు. గెలుపు ఓటములు పైనే జిరాఫీ చెస్ ఆట ఉంటుందని, డ్రా ఉండదని నిర్వాహకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జిరాఫీ చెస్ ను దక్షిణాది రాష్ట్రాల అన్నింటిలో విస్తరింప చేస్తాం. ప్రతి పాఠశాలలో జిరాఫీ చెస్ ఆటను విద్యార్థులకు నే నేర్పిస్తాం. త్వరలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్తానని అక్క తమ్ముడు పేర్కొన్నారు.
byte: భాగ్యశ్రీ, జిరాఫీ చెస్ ఆట రూపకర్త, కడప.
byte: సాయి కిరణ్ రెడ్డి, జిరాఫీ చెస్ ఆట డైరెక్టర్, కడప.
వాయిస్ ఓవర్:4
తమ బిడ్డలు ఇద్దరు జిరాఫీ చెస్ ఆటను రూపొందించడం చాలా సంతోషంగా ఉంది, ఓ తండ్రిగా గర్వంగా ఉందని చెప్పారు. డబ్బులతో కూడుకున్న పనే అయినప్పటికీ పిల్లల కోరిక తీర్చేందుకు ఎంత దూరమైనా వెళ్తామన్నారు. చిన్నతనం నుంచి తమ పిల్లలకు చెస్ ఆట అంటే ఎంతో ఇష్టం. చివరకు వారే జిరాఫీ చెస్ ఆటను రూపొందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
byte: గంగాధర్ రెడ్డి, భాగ్యశ్రీ, సాయి కిరణ్ రెడ్డి తండ్రి, కడప.
వాయిస్ ఓవర్:5
ఇప్పటివరకు ఆటలు అన్నింటిని ఇతర దేశాల వారే కనిపెట్టారు. కానీ జిరాఫీ చెస్ ఆటను ఏపీలో అందులోనూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అక్క తమ్ముడు ఇద్దరు ఈ ఆటను కనిపెట్టడం గొప్ప విషయం. భవిష్యత్తులో ఆట ఎంతో ప్రాచుర్యం పొందుతుంది అని చెప్పారు.
byte: శ్రీనివాస మూర్తి, క్రీడల అభివృద్ధి అధికారి, కడప.
వాయిస్ ఓవర్:
భాను శ్రీ, సాయి కిరణ్ రెడ్డి అక్క తమ్ములను ప్రోత్సహిస్తే వీరు క్రీడా జాతికి వన్నె తీసుకు వస్తారు. వీరికి ప్రభుత్వ అండదండలు ఉండాలి.



Body:జిరాఫీ చెస్ ఆట రూపకల్పన


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.