ETV Bharat / state

ఏపీసీడ్స్​పై కొవిడ్ ప్రభావం.. వేలం వేసి విత్తన విక్రయాలు - Srikalahasti Seed Development Corporation

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్)​ పై కొవిడ్ ప్రభావం పడింది. కరోనా సమయంలో విత్తన విక్రయాలు జరగకపోవడంతో .. నిర్దేశిత సమయం పూర్తి కావడంతో నిల్వచేసిన విత్తనాలు నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం వీటిని వేలం వేసి విక్రయిస్తున్నారు. గిడ్డంగుల్లో ఉన్న స్థలమంతా ఇవే ఆక్రమించడంతో.. రైతులు తీసుకెళ్లిన ధాన్యపు బస్తాలను ఆరుబయటే ఉంచుతున్నారు.

covid effect on ap  seeds
ఏపీసీడ్స్​పై కోవిడ్ ప్రభావం
author img

By

Published : Jul 7, 2021, 2:19 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్)​లో కరోనా సమయంలో విత్తన విక్రయాలు జరగకపోవడంతో ...నిల్వచేసిన విత్తనాలు నిరుపయోగంగా మారాయి. విత్తనాభివృద్ధి సంస్థలో గతేడాది విత్తనశుద్ధి నేపథ్యంలో సుమారు 60 వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు సిద్ధం చేశారు. పూర్తిస్థాయి లాక్​డౌన్ కారణంగా విత్తన విక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. జిల్లాలోనూ సరిహద్దు ప్రాంతాల్లో వీలైనంత మేరకు విక్రయాలు చేసేందుకు సంస్థ అధికారులు శ్రమించారు. అయినప్పటికీ రూ. రెండు కోట్ల మేర విలువైన 20 వేల క్వింటాళ్ల ధాన్యం మిగిలిపోయింది. నిర్దేశిత సమయం పూర్తయిన వీటిని ప్రస్తుతం కేవలం విత్తనాలు కాకుండా బియ్యంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా తీవ్రత దృష్ట్యా మిగిలిపోయిన ఈ ధాన్యం నిల్వల వల్ల ఏపీ సీడ్స్​కు సుమారు రూ.50 లక్షల నష్టం వాటిల్లింది.

ఆరుబయట నిల్వలు.... గత ఏడాది రబీలోను, ఆలస్యపు రబీలో రైతులు సాగు చేసిన వరి విత్తనాలు కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. ఈ దఫా దాదాపు 60 వేల నుంచి 65వేలక్వింటాళ్ల విత్తన లక్ష్యంతో విత్తన శుద్ధికి శ్రీకారం చుట్టారు. ఏపీ సీడ్స్​లో ఖాళీ లేనప్పటికీ పలుచోట్ల గిడ్డంగుల అద్దెకు నిల్వలు ఉంచాల్సి వచ్చింది. అవి సరిపోకపోవడంతో అభివృద్ధి సంస్థ కార్యాలయంలో భారీగా నిల్వలు ఆరుబయట ఉంచారు .వర్షాకాలం కావడంతో యజమాన్యం ఆందోళన చెందుతోంది.. ఖరీఫ్ లక్ష్యంగా....... వర్షాలు కాస్తంత ఊపందుకున్న తర్వాత వరి సాగుచేయడం ఆనవాయితీగా వస్తుంది. రైతుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అవసరమైన దీర్ఘకాలిక రకాలు విత్తన శుద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కేరళలో సాగుచేసే ఉమా రకపు వరి వంగడాలు, కర్ణాటకలో ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపే జ్యోతి రకపు వంగడాలను శుద్ధి చేసే ప్రక్రియ ప్రారంభించారు. దాదాపు మరో నెల రోజులు వరకు విత్తన శుద్ధి ప్రక్రియ జరిగే అవకాశం ఉంది.

ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులకు అవసరమైన అన్నీ వంగడాలను అందుబాటులో ఉంచామని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య తెలిపారు. విత్తనాల కొరత సమస్య దరిచేరనీయకుండా ఆ సమయంలో నిల్వచేసిన సుమారు 20 వేల క్వింటాళ్ల ధాన్యం వేలం వేసేందుకు ప్రధాన కార్యాలయానికి విన్నవించామని ఆయన అన్నారు. అద్దె గిడ్డంగుల్లో ఉన్న వరి ధాన్యాన్ని శుద్ధి చేసే ప్రక్రియ పూర్తయిందన్నారు. ఆరు బయట ఉన్న ధాన్యం శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని వివరించారు.

ఇదీ చూడండి. cm jagan: నాడు-నేడు, జగనన్న విద్యాకానుకపై సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.