ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడతామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్-19 తిరుపతి సమన్వయ కమిటీ సమావేశంలో వైద్యాధికారులతో సమావేశమైన ఆయన.. ప్రజలు అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తోన్న అన్ని ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స అందించాలని సూచించారు. కరోనా విపత్కర సమయంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అధికారులను సమన్వయం చేసుకుంటూ.. వైరస్ బాధితులకు అందిస్తోన్న సేవలను అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.
కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించడం ద్వారా బాధితుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి అధికారులకు సూచించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఇదీ చూడండి..