చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా వార్డులో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందగా ఆ మృతదేహాన్ని అప్పగించకుండా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి మృతదేహం చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సంయుక్త కలెక్టర్లు వీరబ్రహ్మం, రాజశేఖర్ విచారణ చేపట్టారు. వారు రాకముందే మృతదేహాన్ని బంధువులకు అప్పగించడం గమనార్హం.
ఆసుపత్రిలో కరోనా బాధితులను పట్టించుకోవడం లేదంటూ వారి బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారులు కలగజేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు.
ఇదీ చదవండి: స్విమ్స్‌లో బెడ్ల కొరత.. ఆరు బయటే రోగులకు ఊపిరులూదుతున్న వైద్యులు