చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో జగ్గరాజుపల్లెలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. గ్రామానికి చెందిన రామయ్య (38) గ్రామంలోని మంచినీటి ట్యాంకు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య లల్లియమ్మ (35) పొలంలో అనుమానాస్పద రీతిలో మరణించింది.
పోలీసుల విచారణ..
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భార్యను హత్య చేసిన రామయ్య.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానంతో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ విశ్వనాథ్ వెల్లడించారు.
ఇవీ చూడండి : Amul project: 'పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశా.. అమూల్ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చా'