భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. శ్రీనివాసులు(30), మంజుల దంపతులు(26)ఇంట్లో మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను గురించి దర్యాప్తు చేపట్టారు. మృతులకు ఇద్దరు పిల్లలున్నారు.
ఇదీ చదవండి: గోకర్ణపురంలో విద్యుదాఘాతంతో దంపతులు మృతి