చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలంలో జరిగిన కథ. కమ్మలపల్లి గ్రామానికి చెందిన మహేంద్ర నాయుడు, లక్ష్మీదేవిల కొడుకు రిత్విక్. ఎస్.ఎన్.పేటకు చెందిన వెంకటరాజు, సరస్వతి కుమార్తె అఖీల. వీరిద్దరు 2016-17 సంవత్సరంలో కలిసి చదువుకున్నారు. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమను పెద్దల ముందుకు తీసుకువచ్చారు. కులాలు వేరుకావటం వల్ల వీరి ప్రేమను అంగీకరించక.... పెద్దలు అడ్డుపడ్డారు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయిన రిత్విక్, అఖిల ఈ నెల 10న కడపలో పెళ్లిచేసుకుని చంద్రగిరికి చేరుకున్నారు. అఖిల తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉండటంతో తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను వేడుకున్నారు.

ఇదీ చదవండి :