చిత్తూరు జిల్లాలో తాజాగా మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 227కు చేరింది. వీరిలో శ్రీకాళహస్తికి చెందిన ఒకరు మరణించగా.... రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రితో పాటు చిత్తూరు, తిరుపతిలోని జిల్లా కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం నిర్వహించిన పరీక్షల్లో 104 మందికి కరోనా నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. మరో 122 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చెన్నై నగరంలోని హాట్‌స్పాట్ కేంద్రంగా ఉన్న కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న కేసులు జిల్లాలో అధికంగా ఉన్నట్లు కలెక్టర్ విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో డ్రైవర్లు, క్లీనర్లు, మండీ యాజమానుల సహాయకులకు సంబందించిన వారితో పాటు కాంట్రాక్టులకు సంబందించిన వారు కరోనా బారిన పడినట్లు కలెక్టర్ వివరించారు. మూడు రోజులుగా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని వివరించారు.
ఇదీ చూడండి వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం