ETV Bharat / state

తిరుపతిలో 21 మందికి రెండోసారి కరోనా - తిరుపతి తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ రీఇన్‌ఫెక్షన్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఓసారి కొవిడ్‌ చికిత్స పొంది కోలుకున్న కొందరిలో ఐదారు వారాల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. ఇలా రెండోసారి పాజిటివ్‌గా వచ్చిన వారిలో ఆరోగ్య సిబ్బందీ ఉంటున్నారు.

tpt_corona
tpt_corona
author img

By

Published : Nov 9, 2020, 7:27 AM IST

రాష్ట్రంలోని కొవిడ్‌ చికిత్స కేంద్రాల్లో ప్రధానమైన తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో 21 మంది రీఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. వీరిలో 12 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సులు కాగా.. నలుగురు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందినవారు. విజయవాడ జీజీహెచ్‌కు ఇలాంటి కేసే వచ్చినా.. తొలిసారి చికిత్స పొంది డిశ్ఛార్జి సమయంలో తిరిగి పరీక్ష చేయలేదని తెలిసింది. దీంతో ఈ కేసును రీఇన్‌ఫెక్షన్‌గా గుర్తించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం వైరస్‌ సోకినప్పుడు అనుమానిత లక్షణాలు లేకుంటే పది నుంచి 14 రోజుల తర్వాత తిరిగి నిర్ధారణ పరీక్ష చేయకుండానే ఇళ్లకు పంపుతున్నారు.

వ్యాధి తీవ్రత ఉన్న వారికి ఆర్టీపీసీఆర్‌ ద్వారా మరోసారి నమూనాలు పరీక్షించి నెగెటివ్‌ వచ్చాకే డిశ్ఛార్జి చేస్తున్నారు. తిరుపతిలో ఇలా మళ్లీ వ్యాధి లక్షణాలు కనిపించిన వారిలో ఇద్దరు 65 ఏళ్ల వయస్కులు కాగా, మిగిలిన వారి వయస్సు 45 ఏళ్లలోపు ఉంది. కొందరికి ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులున్నట్లు గుర్తించారు. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం డిశ్ఛార్జి అయిన కరోనా బాధితులకు మూణ్నెల్ల తర్వాత మళ్లీ వైరస్‌ సోకితేనే రీఇన్‌ఫెక్షన్‌గా పరిగణిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా కేసులు తక్కువగా ఉన్నాయి.

‘బాధితులు ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యేటప్పుడు నమూనాలు పరీక్షించగా ‘నెగెటివ్‌’ అని వచ్చింది. కానీ వైరస్‌ ఇంకా వారి శరీరంలో ఉండొచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంవల్ల మళ్లీ వ్యాధి బారినపడ్డారని భావిస్తున్నాం. వీరెవరికీ ప్రాణాపాయం లేదు. రీఇన్‌ఫెక్షన్‌పై అధ్యయనం చేస్తున్నాం’’ -రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి

ఇదీ చదవండి:

శబరిమల యాత్రకు నూతన మార్గదర్శకాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.