చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా వెల్లండించారు. చైన్నె కోయంబేడు కూరగాయల మార్కెట్ కు వెళ్ళి వచ్చిన రైతులు, వ్యాపారస్తులు, లారీ డ్రైవర్లు కరోనా వ్యాధి బారిన పడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ రోజు వచ్చిన 11 పాజిటివ్ కేసుల్లో 10 కోయంబేడుతో సంబంధమున్న వారేనని కలెక్టర్ పేర్కొన్నారు.
కోయంబేడు మార్కెట్ కు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించామని చెప్పారు. వారిలో 80 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్ తేలినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. మరో 80 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు.
ఇదీ చూడండి: