ETV Bharat / state

కోరలు చాస్తున్న కరోనా.. రోజురోజుకీ పెరుగుతున్నకేసులు - చిత్తూరు జిల్లా వార్తలు

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సగటున రోజుకు రెండు వందలకు పైబడి పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో తాజాగా 238 పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తిరుపతి, నగరి, పుత్తూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి గ్రామీణ ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. 20 పాజిటివ్‌ కేసులు పైగా ఉన్న గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలోకి చేర్చి ఆంక్షలు కఠినతరం చేశారు అధికారులు.

corona cases
corona cases
author img

By

Published : Jul 14, 2020, 7:28 PM IST

చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతల్లో అనధికారిక లాక్‌డౌన్‌ అమలవుతోంది. పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వ యంత్రాంగం.. వైరస్‌ వ్యాప్తి నివారణకు విస్తృత చర్యలు చేపడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. నిత్యావసరాలకు అధికప్రాధాన్యమిచ్చిన అధికారులు మిగిలిన వ్యాపార, వాణిజ్య సంస్ధలను మూసివేస్తున్నారు.

కేసులు పెరుగుతున్నందున వైద్యసేవల కోసం అవసరమైన ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచడానికి కసరత్తు ప్రారంభించారు అధికారులు. తిరుపతి నగరంలో కరోనా సోకిన నగర వాసులకు వైద్యసేవలు అందించడానికి ప్రత్యేకంగా తితిదే పరిధిలోని శ్రీనివాసం వసతి సముదాయాన్ని వినియోగిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల కరోనా రోగులను పద్మావతి నిలయం, వికృతమాల కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నారు. తిరుపతిలోని రుయా, స్విమ్స్‌, చిత్తూరు కొవిడ్‌ ఆసుపత్రులతో పాటు పద్మావతి నిలయం, శ్రీనివాసం, వికృతమాల కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 3500 పడకలను సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 3074 పాజిటివ్‌ కేసులు నమోదవగా 29 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 20 కేసులకు పైగా నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతున్నారు. పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో గ్రామ సచివాలయ సిబ్బంది తరచూ పర్యటిస్తూ.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న, 60 సంవత్సరాల వయసు పైబడిన వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నారు. చిత్తూరు, తిరుపతి నగరాలతో పాటు శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి పట్టణాల్లో పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరిగిపోతుండటంతో వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా రోజుకు 1800 వందల నుంచి 2వేల వరకు నమూనాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా దాదాపు నాలుగు వేల నమూనాలకు సంబంధించి ఫలితాలు ప్రకటించాల్సి ఉందని అధికారులు తెలిపారు. అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ప్రాంతాలకు యాంటీజెన్‌ కిట్లు, పల్స్‌ ఆక్సీ మీటర్లు సరఫరా చేస్తున్నారు. తిరుపతి నగరంలోని 18 కంటైన్‌మెంట్‌ వార్డులకు వెయ్యి యాంటీజెన్‌ కిట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'సుప్రీం తీర్పు ఓ మైలురాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మారాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.