ETV Bharat / state

విద్యుత్ స్తంభాలు ఎక్కి ఒప్పంద కార్మికుల ఆందోళన

తమను ఉన్న ఫళంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపిస్తూ.. చౌడేపల్లె మండలం లద్దిగం విద్యుత్తు సబ్ స్టేషన్​ వద్ద విద్యుత్ స్తంభాలు ఎక్కి ఒప్పంద కార్మికులు ఆందోళన చేశారు. డిమాండ్​లను పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇవ్వడం వల్ల నిరసన విరమించారు.

contract workers protest from solve they demands at laddigam sub station Chittoor district
విద్యుత్ స్తంభాలు ఎక్కి ఒప్పంద కార్మికుల ఆందోళన
author img

By

Published : Sep 29, 2020, 11:12 PM IST

చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం లద్దిగం విద్యుత్తు సబ్ స్టేషన్​లో విద్యుత్ స్తంభాలు ఎక్కి ఒప్పంద కార్మికులు ఆందోళన చేశారు. తమను ఉన్న ఫళంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేసే వరకు దిగి రామంటూ నిరసన వ్యక్తం చేశారు.

అధికారులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా... ఒప్పంద కార్మికులు ససేమిరా అన్నారు. ఫలితంగా చాలా సమయం పాటు లద్దిగం ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ సరఫరా లేక రైతులు, స్థానికులు ఇబ్బందిపడ్డారు. వారి డిమాండ్​లను పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సబ్ స్టేషన్ అధికారులు నచ్చ చెప్పగా... శాంతించిన కార్మికులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:

స్థిరంగా కొనసాగుతున్న ద్రోణి... వచ్చే 2 రోజులు విస్తారంగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.