శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్, డైరెక్టర్గా సినీనటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్ నియమితులయ్యారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు నిర్ణయం ప్రకారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన ఈ నెల 28న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఛానల్ తొలి ఛైర్మన్గా దర్శకుడు కె.రాఘవేంద్రరావు పనిచేశారు. ప్రభుత్వ మార్పుతో ఆయన రాజీనామా చేశారు.
బాలిరెడ్డి పృథ్వీరాజ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'ఆ ఒక్కటీ అడక్కు'తో సినిమా రంగానికి పరిచయం అయ్యారు. పృథ్వీరాజ్ వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు.
ఇదీ చదవండి : జగన్పై పవన్ విమర్శలకు.. పృథ్వీ కౌంటర్