చిత్తూరు - తచ్చూర్ మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణను.. ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని చిత్తూరు కలెక్టర్ హరినారాయణ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఉద్యానవన, జాతీయరహదారుల సంస్థ, రోడ్లు భవనాల శాఖ అధికారులతో ఈ మేరకు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలోని 7 మండలాల పరిధిలో 46 గ్రామాల రైతుల నుంచి భూ సేకరణ చేయాల్సి ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. 1,114 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని.. ఇందుకు అవసరమైన సర్వే పూర్తి చేసినట్లు చిత్తూరు ఆర్డీవో రేణుక తెలిపారు. చిత్తూరు మండలంలోని 10 గ్రామాలు, గంగాధర నెల్లూరు మండలంలో 6 గ్రామాలు, ఎస్.ఆర్.పురం మండలంలోని 8 గ్రామాలు, నగరిలోని 11 గ్రామాలు, నిండ్రలోని 2 గ్రామాలు, విజయపురంలోని 3 గ్రామాలు, పిచ్చాటూరులోని 6 గ్రామలకు చెందిన రైతుల భూములను సేకరిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి:
భారత్ బయోటెక్ ప్లాంట్‌కు కేంద్ర భద్రత
లక్ష ద్వీప్‌లో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి