ETV Bharat / state

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్​కు చికిత్స: కలెక్టర్ హరి నారాయణన్ - చిత్తూరు జిల్లా కలెక్టర్ తాజావార్తలు

చిత్తూరు జిల్లాలోని కొవిడ్​ పరిస్థితులు, పలు ప్రాంతాల్లో ఏనుగుల వల్ల జరిగిన పంట నష్టంపై కలెక్టర్​ సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లాక్​ ఫంగస్​ చికిత్సను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఏనుగుల వల్ల పంట నష్టపోయిన రైతులకు అందించాల్సిన పరిహారానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.

collector review meeting
కలెక్టర్ సమీక్షా సమావేశం
author img

By

Published : Jun 17, 2021, 10:54 PM IST

చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ కోసం చికిత్సను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ, వైద్యాధికారులతో కొవిడ్​ పరిస్థితులపై సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ, ప్రాంతీయ ఆస్పత్రులన్నింటిలోనూ ఆక్సిజన్​ను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లాక్​ ఫంగస్​కు వైద్యం అందుబాటులోకి తీసుకురావటం వల్ల రుయా, స్విమ్స్​ ఆస్పత్రులపై భారం తగ్గుతుందని కలెక్టర్​ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 124 బ్లాక్​ ఫంగస్​ కేసులు నమోదైనట్లు చెప్పారు.

ఏనుగుల నుంచి సంరక్షణకు...

జిల్లాలో ఏనుగుల వలన పంట నష్టపోయిన రైతులకు పరిహారం, క్రాప్ ఇన్సురెన్స్ చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో జరిగిన సమావేశంలో జిల్లా పాలనాధికారి, సంబంధిత అధికారులు పాల్గొని చర్చించారు. కౌండిన్య వైల్డ్ లైఫ్ విభాగంలో ఉన్న పలమనేరు, కుప్పం, చిత్తూరు ప్రాంతాలలో ఏనుగుల సంచారం ఎక్కువైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఏనుగుల మరణాలు, వాటి వల్ల రైతులకు కలిగిన నష్టం వివరాలను చెప్పారు. గజరాజుల నుంచి ప్రజలను కాపాడేందుకు కార్యచరణ రూపొందించి ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్​ పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖాధికారులతో సమావేశమై వారంలోపు ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద అటవీ శాఖ సమన్వయంతో పనులు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఇదీ చదవండి: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.