ETV Bharat / state

రుయాలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన కలెక్టర్ - ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన చిత్తూరు కలెక్టర్

రోగులకు అత్యవసర సమయాల్లో ప్రాణవాయువును అందించడానికి.. తిరుపతిలోని రుయాలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రాంరంభమైంది. అదనంగా మరికొంత మంది ప్రాణాలను కాపాడటానికి ఉపకరిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. సిలిండర్లూ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

oxygen plant inaugaration
ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభిస్తున్న కలెక్టర్
author img

By

Published : Oct 17, 2020, 1:44 AM IST

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో 10 కే.ఎల్ ఆక్సిజన్ ప్లాంట్​ను చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా ప్రారంభించారు. కొవిడ్​తో పాటు సాధారణ రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 200 బెడ్లకు, 90 వెంటిలేటర్లకు ప్రాణవాయువును సరఫరా చేసే అవకాశం లభించిందన్నారు. ప్లాంట్​తో పాటు సిలిండర్లూ అందుబాటులోకి వచ్చాయన్నారు. నిరుపేదలకు చికిత్స అందిస్తున్న ఈ వైద్యాలయానికి.. నిధులందించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్వీ వైద్య కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ఆన్​లైన్ ద్వారా నిర్వహించిన క్విజ్​లో గెలుపొందిన వైద్య విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్​లు అందచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులపై పరిశోధన చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ఇదీ చదవండి: బీటెక్‌లో మూడేళ్ల తర్వాత డ్యుయల్‌ డిగ్రీకి అవకాశం: తిరుపతి ఐఐటీ డైరెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.