సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ... తిరుమల శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. సీజేఐ హోదాలో తొలిసారి తిరుమలకు వచ్చిన జస్టిస్ రమణకు... ఆలయ మహాద్వారం వద్ద తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు. స్వామివారం దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. జస్టిస్ రమణతో పాటు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత, భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల.. స్వామివారి సేవలో పాల్గొన్నారు.
దర్శనానంతరం తిరుమల పద్మావతి విశ్రాంత గృహంలో బస చేసిన జస్టిస్ ఎన్.వి.రమణ... ఇవాళ ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుంటారు. పదిన్నర గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.
ఇదీచదవండి.