సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల పద్మావతి అతిథిగృహం నుంచి ఆలయ వాహన మండపానికి చేరుకున్న జస్టిస్ దంపతులకు.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ రెడ్డి.. సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు.. ఆలయ పెద్ద మర్యాద అయిన ఇస్తికఫాల్ విధానంలో స్వాగతం పలికి... సంప్రదాయబద్ధంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆలయంలోకి తీసుకువెళ్లారు. శ్రీవారి దర్శనం చేయించి.. స్వామివారి ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం... పద్మావతి అమ్మవారి దర్శనార్థం తిరుచానూరు వెళ్లారు.
తిరుమల శ్రీవారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నా. స్వామివారి ఆశీస్సులతో జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తా- జస్టిస్ ఎన్.వి.రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి
ఇదీ చదవండి: