చిత్తూరు జిల్లాలోని ఆలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని.. ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. కుప్పం మండలంలో విగ్రహాల ధ్వంసం కేసును 24 గంటల్లో ఛేదించామన్నారు. మతిస్థిమితం లేని మహిళ.. ఆలయంలో విగ్రహాలు ధ్వంసం చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. ఇలాంటి ఘటనల్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోకుండా.. పీస్ కమిటీలు ఏర్పాటుచేశామని చెప్పారు.
కుప్పం మండలం గొనుగూరు సమీపంలోని బేటగుట్టపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం అర్చకుడు వినయ్ గుట్ట పరిసరాల్లో గాలించగా శిరస్సుతోపాటు కాళ్లూ, చేతులూ ఖండించిన స్థితిలో చెల్లాచెదురుగా పడివున్న విగ్రహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు ధ్వంసమైన విగ్రహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తెదేపా నాయకులు ఆందోళన చేశారు.
ఇదీ చదవండి: