ETV Bharat / state

గుర్రంకొండ ఉర్దూ పాఠశాల గదిలో...ఏడు తరగతుల గోల - gurramkonda urdu medium school

ఒక గదిలో ఏడు తరగతులు... 175 మంది విద్యార్థులు... 6గురు ఉపాధ్యాయులు ... ఎదురెదురుగా తరగతులు. అబ్బో ఇక్కడ ఒకటే చదువు గోల... అయినా కిక్కిరిసిపోయి చదువుకుంటున్నారు. వర్షం వస్తే అందరూ నిలబడేందుకు స్థలం చాలని పరిస్థితి చిత్తూరు జిల్లా గుర్రంకొండ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులది.

గుర్రంకొండ ఉర్దూ పాఠశాల గదిలో...ఏడు తరగతుల గోల
author img

By

Published : Oct 24, 2019, 6:02 AM IST

చిత్తూరు జిల్లా గుర్రంకొండ మేజర్ పంచాయతీలో ఉన్న 15 వేల మంది జనాభాలో 60 శాతం వరకు ముస్లింలు ఉన్నారు. పట్టణంలోని ఏడవ వార్డు ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల 175 మంది విద్యార్థులతో కిక్కిరెస్తోంది . మూడేళ్ల కిందట ఈ పాఠశాలను ప్రాథమిక నుంచి ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చారు. ఉన్న ఒక గదిలో 1,2 తరగతులు, వరండాలో 3,4 తరగతులు, ఆరు బయట 5,6 ... మరుగుదొడ్డి వద్ద 7వ తరగతి నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు ఎదురెదురుగా పాఠాలు బోధించటంతో ఈ ప్రాంతం అంతా గోలగా ఉంటుంది. అయినా అలాగే కిక్కిరిసి కూర్చుని చదువుకుంటున్నారు. వర్షం వస్తే తలదాచుకునేందుకు నీడలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.

నిధులొస్తున్నాయి.. వెనక్కి వెళ్తున్నాయి..!

పాఠశాలకు అదనపు భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ... స్థానిక రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం కేటాయించని కారణంగా నిధులు వెనక్కి వెళ్లి పోతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మూడేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించిన దాఖలాలు లేవని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుర్రంకొండ ఉర్దూ పాఠశాల గదిలో...ఏడు తరగతుల గోల

ఇవీ చూడండి-'3 నెలల్లోనే రూ.18వేల కోట్ల అప్పు... ఖజానా ఖాళీ చేసిందెవరు?'

Intro:FILE NAME : AP_ONG_43_23_AKRAMA_ISUKA_PATTIVATHA_AV_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU, CHIRALA ( PRAKASAM ) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక పాలసీనీ తెచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే యధేచ్చగా ఆక్రమార్కులు మాత్రం ఇసుకను తరలిస్తూనే ఉన్నారు.... ఎటుంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీసులు పట్టుకున్నారు.చిన్నగంజాం మండలం పెద్దగంజాం నుండి హైదరాబాద్ కు ఇసుక లోడుతో తరలివెళుతున్నయనే సమచారంతో ఇంకొల్లు పోలీసులు నాలుగు లారీలను ఆపి విచారించారు.. కనీసం ఇసుకతలింపు పత్రాలు లేకపోవడంతో నాలుగు లారీలను పోలీసులు స్వాదీనం చేసుకుని ఇంకొల్లు పోలీస్ స్టేషన్‍ కు తరలించారు...నిబంధనలకు విరుద్దంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని ఇంకొల్లు ఎస్.ఐ పున్నారావు తెలిపారు....Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899 Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.