చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. బుధవారం ఒక్కరోజే జిల్లాలో 345 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 5668 కి చేరుకుంది. కరోనాతో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోవటంతో... మృతుల సంఖ్య 64కి చేరుకుంది. తిరుపతిలోనే ఎక్కువగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో... 14 రోజులపాటు నగరంలో లాక్డౌన్ విధించారు.
దుకాణాలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఉన్నట్లు స్పష్టం చేశారు. తిరుమల బైపాస్ రోడ్‌కి మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల నుంచి..3,083 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోవటంతో 2,521 యాక్టివ్ కేసులు జిల్లాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: తంబళ్లపల్లె మండలంలో మెుదటి కరోనా పాజిటివ్ కేసు