పలమనేరు నుంచి నెల్లూరుకు కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఈచర్ వాహనం చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై తొండవాడ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. అయితే లారీలో ఉన్న కోళ్లలో 500 కుపైగా మృతి చెందాయి. అటుగా వెళ్లే వాహనదారుల్లో కొందరుల ఇదే అదునుగా భావించి కోళ్లను ఎత్తుకెళ్లారు.
సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని తిరుపతిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: