కరోనా వైరస్ కట్టడిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ముందు వరుసలో నిలిచి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న.... పోలీస్, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వార్డు వాలంటీర్లకు 25 వేల ఎన్ 95 మాస్కులను ఆయన పంపిణీ చేశారు.
తిరుపతిలోని తుడా కార్యాలయం సమావేశ మందిరంలో.. ఈ కార్యక్రమం జరిగింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని చెవిరెడ్డి కోరారు. ప్రజలు మాస్క్ ధరించి... భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. పాక్షిక కర్ఫ్యూ నిబంధనలను అనుసరించాలని కోరారు.
ఇదీ చదవండి: