ETV Bharat / state

చంద్రగిరిలో ఎమ్మెల్యే గిరీ ఎవరిదో? - chevireddy bhaskar reddy

​​​​​​​తెదేపా జాతీయాధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి వేదిక... మంత్రి గల్లా అరుణకుమారి మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి కేంద్రం.. చంద్రగిరి నియోజకవర్గం. ఇక్కడ గత ఎన్నికల్లో విజయం సాధించిన వైకాపా..... తిరిగి తన స్థానాన్ని నిలుపుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుండగా... చంద్రగిరిపై విజయబావుటా ఎగరవేయాలని తెదేపా పావులు కదుపుతోంది.

ముఖ్యమంత్రి ఇలాకాలో ఎన్నికల పోరు
author img

By

Published : Mar 26, 2019, 6:02 AM IST

Updated : Mar 27, 2019, 8:34 AM IST

చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో చంద్రగిరిది ప్రత్యేక స్థానం. భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గమైన చంద్రగిరిలో రాజకీయాలూ అంతే విస్తృతంగా సాగుతున్నాయి. తెదేపా ఇక్కడ మూడు సార్లు విజయం సాధించింది. 1999 నుంచి 2009 వరకు మూడు సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. రాష్ట్ర విభజనానంతర సమీకరణాల్లో వైకాపా నుంచి చెవిరెడ్డి భాస్కర రెడ్డి గెలుపొందగా... కాంగ్రెస్ నుంచి తెదేపాకి మారి పోటీ చేసిన గల్లా అరుణకుమారి అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఈ సారి తెదేపా నుంచి పులపర్తి నానీ, వైకాపా నుంచి సిట్టింగ్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ముఖ్యమంత్రి ఇలాకాలో ఎన్నికల పోరు

జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే దాకా...

అభివృద్ధి వార్తల్లో కంటే వివాదాస్పద వార్తల్లోనే ఎక్కువగా నిలిచిన భాస్కర రెడ్డి...ప్రతిపక్ష నేత కావడంతో ప్రభుత్వం సహకరించలేదని... వ్యక్తిగతంగా ప్రజలకు అందుబాటులోనే ఉన్నానంటూ ప్రస్తుతం బరిలో దిగుతున్నారు. మూడు దశాబ్దాల పాటు తనదైన ముద్రతో చంద్రగిరిలో రాజకీయాలు సాగించిన అరుణకుమారి అనుచరుడిగా... వైఎస్ రాజశేఖరరెడ్డికి విధేయుడిగా భాస్కరరెడ్డి … రాజకీయాల్లో ఓనమాలు దిద్దారు. YS హయాంలో తుడా ఛైర్మన్ పదివితో పాటు, చంద్రగిరి జడ్పీటీసీ పదవులను ఆయన పొందారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం వైకాపాలో చేరి జగన్​కు ప్రధాన అనుచరుడిగా మారారు. గల్లా అరుణకుమారి కాంగ్రెస్​ను వీడడంతో... ఆ పార్టీ ఓటు బ్యాంకును కలుపుకుంటూ... 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో అనూహ్యంగా విజయం సాధించారు. ప్రభుత్వ వైఫల్యం, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకమే ఈ సారి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెదేపా సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి...

2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్లు జిల్లా ఇన్​ఛార్జీగా బాధ్యతలు స్వీకరించిన అరుణకుమారి... అనారోగ్య సమస్యలతో ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. తెదెపా జిల్లా అధ్యక్షుడు పులపర్తి నానికి ఇన్​చార్జిబాధ్యతలు అప్పగించారు. ఆయన నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ సారి తనని విజయతీరాలకు చేరుస్తాయని నాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:ఆ రాజుగారు అలా.. ఈ రాజు గారు ఇలా!

sample description
Last Updated : Mar 27, 2019, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.