Chandrababu Naidu Kuppam Tour: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని.. ముఖ్యమంత్రి జగన్ లాంటి అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడ ఉండరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రద్దు చేసిన రెండు వేల రూపాయల నోటును. మద్యం దుకాణాల ద్వారా మార్చుకుంటున్నారని ఆరోపించారు. మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా.. చంద్రబాబు మొదటిరోజు కార్యకర్తలు, ముఖ్యనేతలతో సమావేశాలతోపాటు.. రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో భాగంగా ప్రజలతో మమేకమైన చంద్రబాబు వారి సమస్యలనడిగి తెలుసుకున్నారు. రాళ్ళబదుగూరులో.. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును గజమాలలతో సత్కరించారు.
కుప్పం నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా గ్రానైట్ దోపిడీ చేస్తున్నారని.. ధ్వజమెత్తారు. దోచుకున్నదంతా వెనక్కి రప్పిస్తామన్నారు. వైసీపీ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల చేసిన విమర్శలను ప్రస్తావించిన చంద్రబాబు.. జగన్ అవినీతిపై చర్యలెప్పుడని ప్రశ్నించారు. ప్రశాంతమైన కుప్పంలో రౌడీయిజం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
CBN comments: అన్నీ రాసుకుంటున్నా.. ఎవరినీ వదిలిపెట్టా..: చంద్రబాబు
ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకుని దానిని జగన్ విదేశాలలో దాచి పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన జీవితంలో సంపదను సృష్టించేది పేదవాళ్ల కోసం తప్ప పెద్దల కోసం కాదన్నారు. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుందని. ఆదాయం ద్వారా పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తామన్నారు. మైనార్టీలకు జగన్ ప్రత్యేకంగా పథకాలు తీసుకురాకపోగా తమ హయంలో ఉన్న పథకాలు రద్దు చేశారని గుర్తు చేశారు.
తనకు కుప్పంలో ఇళ్లు కట్టుకోవడానికి అనుమతివ్వని తుగ్లక్, సైకో ముఖ్యమంత్రి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రం ఏమైనా జగన్ తాత జాగీరా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని రౌడీలకు నిలయంగా మార్చారని.. ప్రశాంతమైన కుప్పంలో రౌడీలతో బెదిరిస్తున్నారన్నారన్నారు. రౌడీలను అణిచివేసే బాధ్యత తనదని ఆయన తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన వారిని వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.
CBN House in Kuppam: చంద్రబాబు ఇంటి నిర్మాణానికి తప్పని తిప్పలు.. అనుమతుల కోసం ఎదురుచూపు
కుప్పంలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే.. ఏపీని జగన్ వెనక్కి నెట్టేశారని దుయ్యబట్టారు. ఇంకొన్నాళ్లు జగన్ అధికారంలో ఉంటే.. ఏపీ మరో ఉత్తర కొరియాలా మారుతుందని ఆగ్రహించారు. తొలిరోజు పర్యటన ముగిశాక.. రాత్రికి రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో బస చేసిన చంద్రబాబు.. ఇవాళ లక్ష మెజార్టీయే లక్ష్యం కార్యక్రమ లోగో ఆవిష్కరిస్తారు.
"ఈ ముఖ్యమంత్రి అంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఇంత అవినీతిపరుడు ఎవరూ లేరని.. బీజేపీ అధ్యక్షుడే చెప్పారు. హోంమంత్రి కూడా ఇదే విషయం చెప్పారు. చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అని.. వారందరినీ నేను అడుగుతున్నాను". - చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
Satyakumar on Jagan: రాజధాని ఏదో చెప్పలేని దుస్థితిలో ఉన్నందుకు జగన్ సిగ్గుపడాలి: సత్యకుమార్