ETV Bharat / state

తారకరత్న పరిస్థితిపై చంద్రబాబు ఆరా.. వైద్యులు ఏం చెప్పారంటే!

Chandrababu inquired Taraka Ratna's health condition : సినీనటుడు నందమూరి తారకరత్న కుప్పం పీఈఎస్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. పల్స్‌ పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కుప్పంలోనే తారకరత్నకు చికిత్స కొనసాగిస్తున్నారు. తారకరత్న భార్య కుప్పం వచ్చాక బెంగుళూరు తరలింపుపై కుటుంబ సభ్యులు తుదినిర్ణయం తీసుకోనున్నారు.

నందమూరి తారకరత్న
నందమూరి తారకరత్న
author img

By

Published : Jan 27, 2023, 4:20 PM IST

Updated : Jan 27, 2023, 8:34 PM IST

Chandrababu inquired Taraka Ratna's health condition : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన సినీనటుడు తారకరత్న కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. కుప్పం ఆస్పత్రిలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సినీ నటుడు బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత తారకరత్నను పరామర్శించేందుకు లోకేశ్​ కుప్పం పీఈసీ ఆస్పత్రికి వచ్చారు.

బెంగుళూరు నుంచి ప్రత్యేక వైద్యుల బృదం, మెరుగైన పరికరాలు కుప్పంకు తీసుకువచ్చారు. కుప్పంలోనే చికిత్స కొనసాగించే అవకాశాలపై లోకేశ్​, బాలకృష్ణలతో వైద్య బృందం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం కుప్పంలోనే తారకరత్నకు చికిత్స కొనసాగిస్తున్నారు. తారకరత్న భార్య కుప్పం వచ్చాక బెంగుళూరు తరలింపుపై కుటుంబ సభ్యులు తుదినిర్ణయం తీసుకోనున్నారు.

తారకరత్న ఆరోగ్యంపై టీడీపీ నేతలు

చంద్రబాబు ఆరా: అస్వస్థతకు గురైన తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తారకరత్నకు వైద్యం అందిస్తున్న కుప్పం ఆసుపత్రి వైద్యులతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వద్ద ఉన్న బాలకృష్ణతో పాటు, పార్టీ నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడారు. తారకరత్నకు యాంజియోగ్రామ్ నిర్వహించామని, స్టంట్ అవసరం లేకుండానే తారకరత్న కోలుకున్నట్లు చంద్రబాబుకి వైద్యులు చెప్పారు. ముందు జాగ్రత్తగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. ఎయిర్ అంబులెన్స్​లో తరలించాలన్న ఆలోచన మేరకు.. ఆయా అనుమతులపై చంద్రబాబు కర్నాటక సీఎం బొమ్మైని ఫోన్లో సంప్రదించారు.

నిలకడగా ఉంది : తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం బీపీ 120/80 చూపిస్తోందని, గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ అయ్యిందని వైద్యులు వెల్లడించినట్లు చెప్పారు. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషిచేస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.

అత్యవసరమైతే బెంగళారుకు.. : తారకరత్న క్రమంగా కోలుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు బ్లాక్‌లు గుర్తించినట్లు చెప్పారు. తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు ఎప్పటికప్పుడు అడుగుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైతే ఇక్కడే వైద్యం అందిస్తున్నారని.. ఇంకా స్పృహలోకి రాలేదని.. అవసరమైతే బెంగళూరు తరలిస్తారని గోరంట్ల వివరించారు.

బెంగళురు నుంచి బయల్దేరిన అంబులెన్స్: కుప్పం పీఈసీ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పీఈసీ వైద్యులు.. నారాయణ హృదయాలయ చైర్మన్ దేవిశెట్టిని సంప్రదించారు. దీంతో నారాయణ హృదయాలయ నుంచి ఆధునిక అంబులెన్సు కుప్పం బయల్దేరింది. అంబులెన్సు వచ్చాక తారకరత్నను రోడ్డుమార్గంలో బెంగళూరు తరలించనున్నారు.

అసలేం జరిగిందంటే.. లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభం కాగా, లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా పాల్గొన్నారు. తెదేపా కార్యకర్తలు, అభిమానుల తాకిడికి ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు. లోకేశ్‌తో పాటు మసీదుకు వెళ్లి బయటకు తిరిగి వచ్చిన తర్వాత పాదయాత్రలో అభిమానుల తాకిడితో ఇబ్బంది పడ్డారు. గాలి ఆడటం లేదని.. కొంచెం జరగాలని సెక్యూరిటీ సిబ్బంది ఎంత కోరినా అభిమానులు వినకపోవడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, సెక్యూరిటీ సిబ్బంది తారకరత్నను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి :

Last Updated : Jan 27, 2023, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.