ETV Bharat / state

Chandrababu: తెదేపా ఫ్లెక్సీల చించివేత.. పార్టీ నేతల ఆగ్రహం

చిత్తూరు జిల్లా కుప్పంలో.. తెలుగుదేశం ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించేశారు. కర్ణాటక సరిహద్దు నుంచి రాళ్లబుదుగూరు వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిలో 30కి పైగా బ్యానర్లను చించివేయటంపై.. పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

chandrababu 2nd tour at kuppam and flexi issue
తెదేపా ఫ్లెక్సీలను చించివేసిన దుండగులు.. పార్టీ నేతల ఆగ్రహం
author img

By

Published : Oct 30, 2021, 1:06 PM IST

Updated : Oct 30, 2021, 2:25 PM IST

తెదేపా ఫ్లెక్సీలను చించివేసిన దుండగులు.. పార్టీ నేతల ఆగ్రహం

చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం ఫ్లెక్సీ(flexi)లను గుర్తు తెలియని దుండగులు మరోసారి చించివేశారు. తెదేపా అధినేత సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు (tdp chief chandrababu) పర్యటన దృష్ట్యా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు కొత్తగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. కర్ణాటక సరిహద్దు నుంచి రాళ్లబుదుగూరు వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిలో 30కి పైగా బ్యానర్లను దుండగులు చించివేయడంతో.. తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటన(kuppam tour) కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా..వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం సామగుట్టపల్లె బయల్దేరిన చంద్రబాబు.. లక్ష్మీపురం రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం ఆర్.ఎస్.పేట మసీదులో కుప్పంలో ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

BADVEL BYPOLL: ప్రశాంతంగా ఉప ఎన్నిక.. 11గంటల వరకు 20.89 శాతం పోలింగ్

Last Updated : Oct 30, 2021, 2:25 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.