చిత్తూరు జిల్లా కుప్పంలోని సచివాలయం వద్ద హౌసింగ్ లబ్ధిదారులు, తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో నిర్మించిన ఇళ్లను కూల్చివేయడం పట్ల నిరసన తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు అమరావతి నుంచి జూమ్ యాప్ ద్వారా వారితో మాట్లాడారు.. లబ్ధిదారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రెవెన్యూ అధికారులు, నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు..13 మంది మృతి