నూతన సంవత్సరం సందర్భంగా పలువురు వ్రముఖులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మన రాష్ట్రంతో పాటు మహరాష్ట్ర, తమిళనాడుకు చెందిన మంత్రులు, పార్లమెంటు, శాసన సభ్యులు, పలు పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు.
శ్రీవారిని దర్శించుకొన్న అనంతరం భాజపా రాష్ట్ర సహ ఇంఛార్జ్ సునీల్ ధియోధర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న సమయంలోనే రాష్ట్రంలో రాముడి విగ్రహాన్ని ధ్వసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం ఆస్తులు, విగ్రహాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.
ఇదీ చదవండి: కాలాన్ని వినియోగించుకొని...కలల వైపు అడుగులు